కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఆ మంత్రి.. ఏం చేస్తున్రు ?

by Anukaran |   ( Updated:2020-08-11 22:12:09.0  )
కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఆ మంత్రి.. ఏం చేస్తున్రు ?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కంటైన్ మెంట్ జోన్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. పట్టణంలోని పద్మావతి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రత్నం అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి చేపడుతున్న శ్యానిటేషన్ ప్రక్రియను పరిశీలించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల వాసులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వచ్చినంత మాత్రాన గాబరా పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో 220 పడకల వార్డుని ప్రారంభించినట్లు తెలిపారు.

మహబూబ్ నగర్ లో ఆక్సిజన్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కార్పొరేట్ తరహా మహబూబ్ నగర్ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ రాకేష్ , మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్లు విఠల్ రెడ్డి, కట్ట రవి కిషన్ రెడ్డి, పటేల్ ప్రవీణ్ , తిరుమల వెంకటేష్, తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed