డిటెక్షన్ కేంద్రం ప్రారంభించిన మంత్రి 

by Shyam |
డిటెక్షన్ కేంద్రం ప్రారంభించిన మంత్రి 
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ డిటెక్షన్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ డిటెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అయినా ఎవరికీ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న కారణంతోనే లాక్‌డౌన్ సడలింపులు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

tag: Minister srinivas goud, open, Detection Center, mahabubnagar

Advertisement

Next Story