గరిటెపట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. చేపలు ఫ్రై చేస్తూ..!

by Shyam |
గరిటెపట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..  చేపలు ఫ్రై చేస్తూ..!
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : ఈత, తాటి వనాలకు వెళితే కల్లు రుచి చూస్తారు. తేనె కనిపిస్తే స్వయంగా జోపి తేనె బీసీ తాగుతారు. వెంట ఉన్న కొందరికి కూడా రుచి చూపిస్తాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. శుక్రవారం అలాగే చేశాడు. హన్వాడ మండలం వేల్పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చేపల స్టాల్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అప్పటికే కారం మసాలా దట్టించి ఉన్న చేప ముక్కలు తీసుకొని పెనంపై వేసి నూనెలో వేయించారు. తాను ఫ్రై చేసిన ముక్కల రుచి చూసే వారేమో.. కానీ వినాయకుల వద్ద పూజలో ఉండటంతో మంత్రి చేయలేకపోయారు. మంత్రి చేస్తున్న చేపల ఫ్రై నీ వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు, జనం ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Next Story