ఇల్లందులో మంత్రి పువ్వాడ పర్యటన

by Sridhar Babu |
ఇల్లందులో మంత్రి పువ్వాడ పర్యటన
X

దిశ‌, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం పర్యటించారు. తొలుత నగరంలోని ఆమ్ బజార్ కూరగాయల దుకాణాలను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. తర్వాత పలువురు పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లోకి వెళ్లి నగదు తీసుకునేందుకు వచ్చిన వారితో ముచ్చటించారు. బ్యాంక్ పనితీరు, ఖాతాదార్లు సామాజిక దూరం పాటించేందుకు తీసుకున్న చర్యలు వంటి వివరాలను లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జేసీ వెంకటేశ్వర రావు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Tags:Minister puvvada Ajay kumar,visit,Ellandu

Next Story