- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సకాలంలో పూర్తి చేయపోతే.. చర్యలు తీసుకోండి
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేశారు. కొనసాగుతున్న అనేక పనులపై మున్సిపల్ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలకు తీసుకుంటామని హెచ్చరించారు. కొనసాగుతున్న ఆయా పనులపై ఆయా కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల నుంచి పనుల నివేదికను కోరాలని సూచించారు.
సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రాంగణంలో రూ.23 లక్షలతో నిర్మించ తలపెట్టిన వీధి వ్యాపారులకు దుకాణ సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆగస్టు 15 నాటికల్లా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. అనంతరం గట్టయ్య సెంటర్‌లో నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని సందర్శించారు.
పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఖానాపురం చెరువును మంత్రి పువ్వాడ పరిశీలించారు. ఖమ్మంకు ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని తలచారు. చెరువుకు చుట్టూ విశాలమైన బండ్ నిర్మించి, ఒకవైపు ఫెన్సింగ్ మరో వైపు మొక్కలు, గ్రీనరి, లైటింగ్ అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులకు సూచించారు. బల్లెపల్లి మూడో డివిజన్లలో గ్రేవీ యార్డును సందర్శించారు. వైకుంఠదామంలో చేపట్టిన పనులను పరిశీలించారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 248 కల్యాణలక్ష్మీ చెక్కులకు గాను రూ2.48 కోట్లను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు. నేటి వరకు నియోజకవర్గంలో 3500 చెక్కులకు గాను రూ.25 కోట్లు పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు.