- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారణాలు అనవసరం.. వేగం పెంచండి’
దిశ, ఖమ్మం: సీతారామ మొదటి, రెండో దశ పనులను మంత్రి అజయ్‌కుమార్, సీఎంవో కార్యాలయ అధికారి స్మితా సబర్వాల్ సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీచ్‌కొత్తూరు వద్ద జరుగుతున్న సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శుక్రవారం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా అక్కడకి చేరుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపై మంత్రి అజయ్‌కుమార్, స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరుగుతుండటంపై మండిపడ్డారు. పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని, కారణాలు చెప్పకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా శ్రద్ధ చూపాలని హెచ్చరించారు. వలస కూలీలు వెళ్లిపోవడంతోనే పనుల్లో వేగం తగ్గిందని అధికారులు సమాధానం చెప్పారు. వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. నైపుణ్య కలిగిన సిబ్బంది కొరత కారణంగానే పనులు కాస్త నెమ్మదించినట్టుగా తెలిపారు.