సంతోషంగా ఉంది: మంత్రి నిరంజన్ రెడ్డి

by Sridhar Babu |
సంతోషంగా ఉంది: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై రూ. 60 వేల కోట్లు వెచ్చిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఆధునీకరించడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్గిందన్నారు. వాతావరణం‌, భూముల రీత్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మక్క సాగుకు అనువుగా ఉంటుందని మంత్రి వివరించారు. భారతదేశంలో వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. సమాజం అభ్యున్నతికి వ్యవసాయ రంగమే మూలాధారమని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతే రాజు అనే నినాదాన్ని ఆచరణ సాధ్యం చేసింది సీఎం కెసిఆరే అని ఆయన అన్నారు. రైతు వేదికల ఏర్పాటులో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం అని, జాతి సంపదను పెంచేది తెలంగాణ రాష్ట్రమేని మంత్రి అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed