మహారాష్ట్రలో తెలంగాణ మంత్రి పర్యటన

by Shyam |
మహారాష్ట్రలో తెలంగాణ మంత్రి పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునిక వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించాలని, సాంపద్రాయ సాగు విధానాలకు స్వస్తి పలుకాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన గురువారం బారామతి కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. తెలంగాణలో వ్యవసాయానికి కొత్త రూపు తీసుకువచ్చామని, రైతుల జేబులు నిండాలన్నదే తమ లక్ష్యమన్నారు. బారామతి కేవీకే వ్యవసాయ క్షేత్రం రైతుల ఆధునిక దేవాలయమని, వ్వవసాయ రంగంలో శరద్ పవార్, ఆయన సోదరుడు అప్పా సాహెబ్ పవార్‌ల మూడు దశాబ్దాల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. బారామతి కేవీకే సందర్శన అధ్యయనానికి, స్వీకరించడానికి, పాటించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పశ్చిమ మహారాష్ట్ర, తెలంగాణలో ఒకే రకమైన సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు.

బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో అనుసరిస్తున్న సాగు పద్దతులు తెలంగాణ రైతులకు అనుసరణీయమని, బారామతిపై ఇంత వరకు మాట్లాడుకోవడమే ఉండేదని, ఇప్పుడు చూసి నేర్చుకోవడం బాగుందన్నారు. 1969తెలంగాణ ఉద్యమ అద్యయనం కోసం శరద్ పవార్ హైదరాబాద్ వచ్చానంటూ గతంలో చెప్పారని, పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపాలని సీఎం కేసీఆర్ చెప్పారని, శుక్రవారం పవార్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పుతానని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed