- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఎరువుల కొరత లేకుండా చూడాలి’’
దిశ, న్యూస్ బ్యూరో: వానాకాలం పంటకు రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ వాటా 35 వేల మెట్రిక్ టన్నులు, మే వాటా 1.6 లక్షల టన్నుల యూరియా వెంటనే తీసుకువచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్రం కోసం గతంలో కోరిన రేక్ పాయింట్లను వెంటనే మంజూరు చేయాల్సిందిగా రైల్వే అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. హైదరబాద్‌లోని హాకాభవన్‌లో రాష్ట్రంలో వానాకాలం పంట ఎరువుల అంశంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు.
సిద్ధంగా ఉన్న ఎరువులు..
రేక్ పాయింట్లలో ఎరువులు 24 గంటల్లో అన్‌లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.68 లక్షల యూరియాతో కలిపి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మే వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, లక్ష టన్నుల ఇతర ఎరువుల బఫర్ నిల్వలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్, రైల్వే, ఆగ్రోస్ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు హ్యాండ్లింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.
Tags : telangana, agriculture, fertilizers, review, by agriculture minister, niranjanreddy