- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలది దొంగ దీక్ష: మంత్రి సింగిరెడ్డి
దిశ, న్యూస్ బ్యూరో : రాజకీయ లబ్ధికోసం బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కారించాలని శుక్రవారం బీజేపీ నేతలు చేపట్టిన దీక్షలపై నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ మాదిరిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయో నిరూపించాలని బీజేపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు.
ప్రకృతి వైపరిత్యం ఒక్క తెలంగాణకే పరిమితం కాదన్న విషయంలో రైతులకు ఉన్న స్పష్టత బీజేపీ నేతలకు లేక పోవవడం విచారకరమన్నారు. పంటల కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నామని తెలిపారు. పంట సాగును పరిగణలోకి తీసుకొని 7077 వరి, 1027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో పూర్తి అవగాహనతో ఉందన్నారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తే అదే వారు రాష్ట్ర ప్రజలకు చేసే పెద్దమేలన్నారు. రైతుల పట్ల మీకు ప్రేమ, బాధ్యత ఉంటే పసుపుబోర్డు సాధించండని హితవు పలికారు.
Tags: Niranjan Reddy, Market, Corn, Paddy, curcumn board, Bjp,Trs