- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది : మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రూ. 4 కోట్ల 4 లక్షల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్‌లో అన్ని మున్సిపాలిటి, కార్పొరేషన్‌లను అభివృద్ధి చేసేందుకు రూ.300 కోట్లు వెచ్చించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ… మొదటిసారి మేడ్చల్ మండలానికి రావడం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి వెంట.. స్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్, కౌన్సిలర్లు సౌకరబోయిన రజిత, లక్క రెడ్డి, శ్రీలత, శివలింగారి వీణ, అమరం సరస్వతి, బేరి బాలరాజు, చింత పెంటయ్య, మారేపల్లి రాజ కుమారి, పసల అంతోనమ్మ, సముద్రాల హంసారాణి, అమరం జైపాల్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, దొడ్ల మల్లిఖార్జున్, అమరం హేమంత్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, భాను, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డీఈ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.