- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ : తలసాని
దిశ, న్యూస్‌బ్యూరో :
తన పని తీరుతో మంత్రి కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌గా నిరూపించుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే ఎ. జీవన్‌రెడ్డిలు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఒక వరం ఇచ్చారన్నారు. ఐటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నదంటే అది కేటీఆర్ చొరవే అన్నారు. గత జీఎచ్ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుస్తామని చెప్పి 99 రావాడానికి కారణం అయనే అన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్ల పాటు ఇదే విధంగా పని చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఐటీలో దేశంలోనే హైదరాబాద్ ముందన్నదంటే కేటీఆర్ కృషి వల్లేనని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చారన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు కోసం కష్టపడి పనిచేసే నాయకుడని కొనియాడారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి దేశం హర్షించే నేతగా కేటీఆర్ ఎదిగారన్నారు. రాష్ట్రం మెచ్చిన నాయకునిగా తండ్రికి తగ్గ తనయునిగా కేటీఆర్ పేరు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ యువతకు ఐకన్‌గా, పార్టీ నేతలకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఐటీ శాఖామాత్యులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ ఎగుమతుల్లో నెంబర్ వన్ చేసి, పరిశ్రమల శాఖామాత్యులుగా టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఉత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారన్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వంలో సహచర మంత్రిగా నిత్యం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా ఉంటూ ప్రజ సంక్షేమానికి పాటుపడటం గొప్ప అవకాశమన్నారు.