డబుల్ బెడ్‎రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

by Shyam |
డబుల్ బెడ్‎రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్ : హైద‌రాబాద్ జియాగూడ‌లో డబుల్ బెడ్‎రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సోమవారం అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో నిర్మించిన 840 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు బస్తీ దవాఖానా, పలు కిరాణ షాపులను ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా సాకారం చేసిందని అన్నారు.

ఈ హౌసింగ్ కాలనీలో రూ.71.49 కోట్ల వ్యయంతో 840 డబుల్ బెడ్‎రూం ఇళ్లు నిర్మించారని తెలిపారు. న‌గ‌రం మొత్తంలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూంలు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ జియాగూడ, గోడె కి క‌బ‌ర్, క‌ట్టెల‌మండిలో క‌లిసి 1,152 ఇళ్లు పేద‌వారికి అందజేస్తున్నామ‌ని చెప్పారు. ఃనిరుపేద ఆడపిల్లలకు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల ద్వారా సహాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed