- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా వ్యాక్సిన్ పై కేటీఆర్ జోస్యం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో చాలా దేశాలు తలమునకలయ్యాయి. పబ్లిక్, ప్రైవేటు అనే తేడాలు లేకుండా అన్ని ఫార్మా కంపెనీలు వైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ ఫార్మా కంపెనీలు కూడా మెడిసిన్, వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిర్వహించి కొంతమేర సక్సెస్ అయ్యాయి. అయితే కరోనా కట్టడికి మందుతో పాటు వ్యాక్సిన్ కూడా హైదరాబాద్ నుంచి రాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ ప్రాజెక్టుతో హైదరాబాద్ ఫార్మా సిటీకి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మా సిటీ అవతరించబోతుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాధాన్యత, అవసరం పెరిగిందని వివరించారు.అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.