- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదు :కేటీఆర్
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్లోకి చేరారు. శ్రీధర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రచార ఆర్భాటం తప్ప చేసేదేమి లేదని విమర్శించారు. బీజేపీ నేతల ఇళ్లలో డబ్బులు దొరికితే తమవి కావంటున్నారు. బీజేపీ ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆరేళ్లలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్దే ఘన విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అడుగడుగునా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నా.. విపక్షాలు తీరు మార్చుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏం చేశారని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని విమర్శంచారు. ఆరేళ్లలో రూ.2.72 లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1.40 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు.