- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లీనరీకి ఆహ్వాన కమిటీ సభ్యులు వీరే.. ప్రకటించిన కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25న హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్లీనరీ కమిటీని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం హెచ్ఐసీసీలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఆహ్వాన కమిటీ సభ్యులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని నియమించారు. అదేవిధంగా సభా వేదిక ప్రాంగణం అలంకరణ బాధ్యతలను ఎమ్మెల్యే గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి చూస్తుండగా.. ప్రతినిధుల నమోదు వాలంటీరుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. హాజరయ్యే ప్రతినిధుల భోజనం వ్యవహారాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీర్మానాల కమిటీ సభ్యులుగా మాజీ స్పీకర్ మధుసూదనా చారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పర్యాద కృష్ణమూర్తి, మీడియా బాధ్యతలను ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ అలంకరణకు గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
- Tags
- hicc
- minister Ktr