- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అందరికీ రేషన్ అందించడమే లక్ష్యం : కొడాలి నాని

రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయాలు చేయడం దారుణమని తెలిపారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా ప్రతిపక్షం ఉండాలన్నారు. ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం
గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్లు ప్రతి ఇంటికివెళ్లి వాళ్ల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని తెలిపారు.
Tags : Minister Kodali Nani, Slams, Yellow Media, Misinformation, ncbn, ration