- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తాం : మంత్రి జగదీష్ రెడ్డి

X
దిశ, సూర్యా పేట; ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కార్ క్షుద్రరాజకీయాలకు పాల్పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణా సమాజానికి మోడీ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అంగీకరించే వరకు ఒత్తిడి చేస్తామని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయం లో కేంద్రాన్ని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తెలంగాణా రైతాంగం బాగుపడడం ఇష్టం లేకనే రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం ముందుకు తెస్తోందని విమర్శించారు. రైతుల ఆగ్రహంతో మోడీ సర్కార్ మాడి మసై పోతుందని, కేంద్రం పద్ధతి మార్చుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
Next Story