Rajiv Yuva Vikasam:రాష్ట్ర ప్రభుత్వ పథకం అప్లై చేశారా.. ఇవాళే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

by Jakkula Mamatha |   ( Updated:14 April 2025 2:35 AM  )
Rajiv Yuva Vikasam:రాష్ట్ర ప్రభుత్వ పథకం అప్లై చేశారా.. ఇవాళే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ‘రాజీవ్ యువ వికాసం’ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ/బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 50,000 నుంచి రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పథకానికి దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 14) ముగియనుంది.

అయితే.. దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో గడువును ఈ నెలాఖరు వరకు లేదా మరో 10 రోజుల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. గతంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మళ్లీ గడువు పొడిగింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ పథకం కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు https://tgobmms.cgg.gov.in/ చేసుకోవాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed