- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గతేడాది ఆర్సీబీ చేసింది.. ఈ సారి మేము అదే రిపీట్ చేస్తాం : Nitish Kumar Reddy

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా శుక్రవారం చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, మిగతా ఐదు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్కటి ఓడినా ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువ. చెన్నయ్‌తో మ్యాచ్ అనంతరం హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలపై నితీశ్ కుమార్ రెడ్డి స్పందించాడు.
తాము మెరుగైన ఆట ఆడితే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటామని చెప్పాడు. ఈ సందర్భంగా గతేడాది ఆర్సీబీ వరుసగా 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ సారి తాము కూడా అదే రిపీట్ చేస్తామని దీమా వ్యక్తం చేశాడు. ‘చెన్నయ్‌పై గెలవడం హ్యాపీగా ఉంది. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. డూ ఆర్ డై లాంటిది. ఇకపై మేము ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించడం గురించి ఆలోచిస్తాం. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ గెలిచేందుకు 100 శాతం ప్రయత్నిస్తాం. గతేడాది ఆర్సీబీ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది. కానీ, వరుసగా 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది మేమేందుకు అలా చేయలేం. 100 శాతం ప్రయత్నిస్తాం.’ అని నితీశ్ తెలిపాడు.