‘ఆక్సిజన్ కొరత లేదు..త్వరలో మరో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్’

by Shyam |
‘ఆక్సిజన్ కొరత లేదు..త్వరలో మరో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్’
X

దిశ సూర్యా పేట : జిల్లాలో త్వరలో మరో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ నిర్మాణం చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలాంటి ఆక్సిజన్ కొరతలేదని అన్నారు. త్వరలో మరో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పాజిటివ్ కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇప్పటికే ఆసుపత్రిలో 240 బెడ్స్ కి 203 పేషెంట్లకు నిండి ఉన్నయని అలాగే ఆక్సిజన్ బెడ్స్ 130 కి 129 నిండి యున్నయని అన్నారు.

ఐసీయూ బెడ్స్ 40 కుగాను 29 వెంటిలేటర్, 8 వెంటిలేటర్ లేకుండా నిండి ఉన్నాయని అన్నారు. ఇప్పటికే హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజక వర్గాల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచామని అన్నారు. జనరల్ బెడ్స్ 70 కు గానూ 37 నిండి యున్నాయని పేర్కొన్నారు. అడ్మిట్ అయిన ప్రతి పేషంట్లకు నాణ్యమైన ఆహారంతో పాటు డ్రై ప్రూట్స్స్ అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో రేమిడేసివర్ ఇంజెక్షన్లు, ఇతర మందులు కొరత లేదని డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా పేషంట్ల వద్ద అధిక ధరలు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇంటివద్ద హొమ్ ఐసోలేషన్ లేని వారికి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలకు తలరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Advertisement

Next Story