ఆశా కార్యకర్తల సేవలు వెల కట్టలేనివి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Aamani |   ( Updated:2020-04-15 04:31:53.0  )
ఆశా కార్యకర్తల సేవలు వెల కట్టలేనివి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం సాధారణ విషయం కాదని, వారి సేవలు వెల కట్టలేనివని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాలో 220 మంది ఆశా వర్కర్లకు ఐకేఆర్ ఫౌండేషన్ తరఫున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు 1000 మందికి ఐకేఆర్ ఫౌండేషన్ తరఫున అల్లోల గౌతమ్ రెడ్డి, దివ్య రెడ్డి చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేసినట్టు వివరించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూరగాయలు, నిత్యావసర సరుకులను ఇంటి వద్ధకే సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వసంతరావు, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి కార్తీక్, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, అల్లోల గౌతమ్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజేశ్వర్, మారుగొండ రాము, నరహరి, నర్సాగౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, asha workers service great, minister indrakaran reddy

Advertisement

Next Story

Most Viewed