- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
దిశ, ఆందోల్: అధికార పార్టీ నేతలకు కరోనా భయం పట్టుకుంది. గురువారం జరిగిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ముఖ్య అనుచరుడైన ఒకరికి కరోనా పాజిటివ్ అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం సాయంత్రం వెల్లడించారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తి క్రియాశీలకంగా వ్యవహరించాడు.
సదరు వ్యక్తి కరోనా టెస్ట్‌కు వెళ్లాడన్న విషయం తెలిసినప్పటికీ అతనికి రెవెన్యూ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీలకమైన బాధ్యతలను ఎమ్మెల్యే అప్పగించడం పట్ల పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే తీరుపై మంత్రి అసంతృప్తి
రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో కరోనా వచ్చిన వ్యక్తి తోనే పనులు చేయించడం పట్ల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీరుపై మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. కరోనా నిబంధనలు పాటించకపోవడం ఆయన అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో మ్మెల్యే క్రాంతి కిరణ్‌తో సహా మరికొందరు నేతలు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది.