ఇలా పాల్గొంటానని కలలోనూ ఊహించలేదు

by Shyam |
ఇలా పాల్గొంటానని కలలోనూ ఊహించలేదు
X

దిశ, దుబ్బాక: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మనమధ్య లేకపోవడం బాధగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని రాంరెడ్డి, ఏస్వీ గార్డెన్స్ లలో గురువారం రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాల్లోని 352 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరిశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనూ… ఈనాడు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకూ రామలింగారెడ్డి పని చేశారని గుర్తు చేశారు.

Advertisement

Next Story