బీజేపీ మాయ మాటలను ప్రజలు నమ్మరు: మంత్రి హరీష్ రావు

by Sridhar Babu |
బీజేపీ మాయ మాటలను ప్రజలు నమ్మరు: మంత్రి హరీష్ రావు
X

దిశ, జమ్మికుంట: బీజేపీ పార్టీ చెప్పే మాయమాటలను, ముసలి కన్నీరును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నాయకుడు అనే వారు ప్రజల కోసం త్యాగం చేయాలన్నారు. కానీ, ఈటల స్వార్థ ప్రయోజనాల కోసం రాజీనామా చేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రజల కోసం రాజీనామా చేస్తే బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్రం తెచ్చిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రి కాన్వాయ్, వాహనాలు రైతుల మీద నుంచి వెళ్తుంటే నలుగురు రైతులు మృతి చెందడం బాధాకరమన్నారు. అటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పాలనలో ఉండదని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story