- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలతో మంత్రి హరీష్ ఆసక్తికర ముచ్చట్లు.. వైరల్ అవుతోన్న వీడియో
దిశ ప్రతినిధి, కరీంనగర్: సెకండ్ కేడర్ లీడర్లతోనే సరిపెట్టకుండా మంత్రి హరీష్ రావు ఓటర్లతో డైరక్ట్ కాంటాక్ట్‌లోకి వెళుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రి వ్యవసాయ కూలీలతో ముచ్చటిస్తున్న వీడియో”దిశ” చేతికి చిక్కింది. ఈటల రాజేందర్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ హరీష్ రావు మహిళా కూలీలతో మాట్లాడుతున్నారు. రూపాయి బొట్టు బిల్లలు, 60 రూపాయల గోడ గడియారం ఇస్తూ ఓట్లు అడుగుతున్నాడు, ఈటల రాజేందర్ వాటితో బతుకుతమా మనం అంటూ వారిని ప్రశ్నించారు. మరి మీ దయ ఉండాలి, మీ ప్రేమ ఉండాలి అంటూ హరీష్ రావు టీఆర్ఎస్‌కే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కాదని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఈటలకు 4 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తే ఒక్క ఇళ్లు కట్టియ్యలే, నేను సిద్దిపేట కాడా 3600 ఇళ్లు కట్టిచ్చిన, బరువు నాపై ఉంచండి ఆరు నెలల్లో ఇళ్లు కట్టిచ్చే బాధ్యత నాదేనంటూ హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు. కారు గుర్తును మర్చిపోకండని, మన పిల్లగాడు గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
ఎందుకిలా?
మండల, గ్రామ స్థాయి నాయకులతో టచ్‌లో ఉంటూ, సమీకరణాలు చేపట్టిన మంత్రి హరీష్ రావు దారిన పోతూ కూలీలలతో ముచ్చటించడం ఏంటీ అన్నదే అర్థం కాకుండా పోయింది. లోకల్ లీడర్లను కాదని మహిళా కూలీలతో కాసేపు మాట్లాడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇలాంటి చర్యలకు మంత్రి హరీష్ పూనుకోలేదు. ఉన్నట్టుండి మంత్రి లోకల్ లీడర్లకు ఝలక్ ఇచ్చే విధంగా వ్యవసరించారేంటీ అన్న విషయంపై టీఆర్ ఎస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
అదే కారణమా?
హుజురాబాద్‌లో ఎలాంటి ఎత్తులు వేసినా సక్సెస్ కాలేకపోతున్నామన్న విషయాన్ని గుర్తించే మంత్రి హరీష్ రావు, తన ప్రచారం స్టైల్ మార్చి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లీడర్లపై అన్ని వ్యవహారాలను వదలేస్తే అనుకూలమైన పరిస్థితులు నెలకొనేలా లేవన్న బావనతోనే మంత్రి మహిళా కూలీలతో ముచ్చటించి ఉంటారని తెలుస్తోంది. దీనివల్ల పల్లెల్లో చర్చ జరిగుతుందని ప్రజల్లో సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఇంచార్జీలు.. లీడర్లు
మూడు నెలలుగా హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నా సమూలమైన మార్పు రావడం లేదని సర్వేలు, నిఘా వర్గాల నివేదికలు తేల్చి చెప్తున్నాయి. మంత్రులు, ఇతర ప్రముఖులు హుజురాబాద్‌పై దృష్టి సారించినా ఫలితం కనినించడం లేదు. దీంతో ప్రజలతో మమేకం అయితే తప్ప అనుకూలత వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ కారణంగానే మంత్రి హరీష్ రావు మాస్ పబ్లిక్‌లోకి చొచ్చుకపోయే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.