- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కుర్చీపై ఈటల కుట్ర.. మినిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, హుజురాబాద్: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో సిటీ సెంట్రల్ హాల్‌లో నియోజకవర్గంలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రికార్డు స్థాయి ధాన్యం అందించి ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తున్న రైస్ మిల్లర్లను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి గెలుపునకు కృషి చేస్తామని మిల్లర్ల ప్రతినిధులు తీర్మానం చేసి, లేఖను మంత్రి గంగులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంకల్పంతో యాసింగి సీజన్లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించిందని ఈ సమయంలో రైస్ మిల్లర్ల భాగస్వామ్యం మరువలేనిదన్నారు.
ఈ ధాన్యాన్ని నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేయడంలో సహకరిస్తున్న రైస్ మిల్లర్లకు మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలక భాగస్వామ్యం మిల్లర్లదే ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను పరిగెలతో పోల్చిన వారికి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ను ఎదిరిస్తే సీఎం పదవి దక్కుతుందనే దురాశతో చేసిన కుట్రలు నీచమైనవన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గాలికొదిలేసి స్వలాభం కోసం రాజకీయం చేయడం నీచమైన చర్య అన్నారు. ఈటల హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది అన్నారు. ఈ దురవస్థ పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.