- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి
దిశ, కరీంనగర్ :
జిల్లాలో హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.గురువారం హరితహారంపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న నగరాన్ని హరిత వనంగా మార్చాలని, ఇందులో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 43లక్షల మొక్కలను నాటాలని, 85శాతం మేర బతికే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. జిల్లా సరిహద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఆర్&బీ రోడ్లకు ఇరువైపులా 3 వరుసలుగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలకు వచ్చే నిధులతో పకడ్భందీగా ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ నిధుల నుంచి 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలన్నారు.
నగరంలో 40 స్మార్ట్ టాయ్ లెట్స్..
స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్‌లో 40 స్మార్ట్ టాయ్ లెట్స్ నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి వెయ్యి మందికి ఒక టాయ్‌లెట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని, రద్దీప్రాంతాల్లో కూడా వీటి నిర్మాణం చేపట్టేందుకు వ్యుహం సిద్ధం చేస్తున్నామన్నారు.