Thanks CM KCR.. శాఖ తొలగింపుపై ఈటల రియాక్షన్ ఇదే!

by Anukaran |   ( Updated:2021-05-01 04:39:18.0  )
Thanks CM KCR.. శాఖ తొలగింపుపై ఈటల రియాక్షన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూకబ్జా వ్యవహారంలో తన శాఖను సీఎంకు బదలాయించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రణాళికాబద్ధంగానే కుట్ర జరుగుతోందని మీడియాతో అన్నారు. కుట్ర చేసే వారంతా రాజోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారన్నారు. ప్లాన్‌ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయని, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

‘నాపై వచ్చిన ఆరోపణలకు వివరణ అడిగితే బాగుండేది. మూడు రోజులుగా కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. విచారణ నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అనుచరులు శ్రేయోభిలాషులతో కలిసి చర్చించి ముందుకు సాగుతా.. మంత్రి పదవులు ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రి ఇష్టం వద్దనుకుంటే తీసేయొచ్చు ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయినా పర్వాలేదు అని ఆనాడే చెప్పాం. మాకు మంత్రి పదవి ఉంటే చాలు అనేది మా గౌరవంగా భావించాం’ అని ఈటల వ్యాఖ్యానించారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయన్నారు. అని ఈటల రాజేందర్ మీడియాతో అన్నారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ముదిరాజ్ నాయకులు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నాయకుడు పార్టీకి రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed