- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉంది.. జాగ్రత్తలు తప్పనిసరి : ఈటల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీకా పంపిణీ వేగవంతం చేయటంతో నిల్వలు తగ్గిపోయాయి. అందువల్ల ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగింది. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ కొరతను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కోరారు. వ్యాక్సిన్ అందుబాటులో లేనందునే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని అన్నారు.
అంతేగాకుండా.. ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత లేదని, వెంటనే ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం దృష్టిపెట్టాలని కోరారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌ను ప్రైవేట్ ఆస్పత్రులు పాటించాలని సూచించారు. సోమవారం నుంచి రెమిడెసివిర్ కొరత లేకుండా సరఫరా చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30 లక్షల డోసులు పంపించాలని కేంద్రాన్ని కోరగా… కేవలం 4.6 లక్షలు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో టీకాల కొరత ఏర్పడింది. ఆదివారం మరో 2.6 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు.