జై జవాన్.. జై కిసాన్.. జై డాక్టర్ : ఈటల

by Shyam |
జై జవాన్.. జై కిసాన్.. జై డాక్టర్ : ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్‌: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా మహమ్మారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఇప్పటికే ఎన్నో వైరస్‌లు ఎదుర్కొన్నది అని అన్నారు. కరోనా డెత్ రేట్‌లో మనమే తక్కువగా ఉన్నామని తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో డాక్టర్స్, ఆశావర్కర్లు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని ప్రశంసించారు. ఎప్పుడు.. జై జవాన్, జై కిసాన్ అనే మనం ఇప్పుడు జై డాక్టర్ కూడా అనాలని పిలుపునిచ్చారు. కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారమే కరోనా చికిత్స, టీకా పంపిణీ చేస్తామని ప్రకటించారు. వైరస్ సోకిన వ్యక్తులు భయాందోళనకు గురికావొద్దని, మహమ్మారికి మొదటి మందు ధైర్యమే అని సూచించారు. కరోనా చికిత్సలో ఇప్పటివరకూ 800 మంది వైద్యులు మరణించారని అన్నారు.

Advertisement

Next Story