ఆయుష్ రక్ష కిట్స్‌ను పంపిణీ చేసిన ఈటల

by Shyam |
ఆయుష్ రక్ష కిట్స్‌ను పంపిణీ చేసిన ఈటల
X

ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సెంట్రల్ జోన్ జాయింట్ సీసీ విశ్వప్రసాద్, బాలానాగదేవి ఐపీఎస్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయుష్ కిట్లను రెడ్ జోన్‌లో పనిచేసే పోలీస్, వైద్య, మున్సిపల్ సిబ్బందికి అందజేయనున్నారు. మొదటి దఫా దాదాపు 20 వేల కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణీ ఆధ్వర్యంలో ఐదు రకాల మందులతో ఆయుష్ కిట్లను తయారు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ కరోనా వ్యాప్తి నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంతో వైరస్ వ్యాప్తి, మరణాలు రేటు చాలా తక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లేబోరేటరీ డైరెక్టర్ శ్రీనివాసచారి, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కె.సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు, డాక్టర్ సురేష్ జకోటియా పాల్గొన్నారు. విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్‌ను రెండు వేల యూనిట్లనూ పంపిణీ చేయనున్నారు.

Tags: Ayush Raksha Kits, distribution, minister etala rajendar, brk bhavan, hyd, ts

Advertisement

Next Story

Most Viewed