సీఎంఆర్ఎఫ్‌‌కు వ్యాపారి రూ.లక్ష విరాళం

by vinod kumar |
సీఎంఆర్ఎఫ్‌‌కు వ్యాపారి రూ.లక్ష విరాళం
X

దిశ, వరంగల్: కరోనా నియంత్రణకు మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు ప‌ట్ట‌ణానికి చెందిన వ్యాపారి చిదిరాల గీతాన‌వీన్ తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్ర‌క‌టించారు. ఈ మేరకు విరాళం డబ్బులను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు బుధవారం అంద‌జేశారు. అనంతరం నిరుపేద‌ల‌కు పంపిణీ చేస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల లోగోను మంత్రి చేతుల మీదుగా ఆవిష్క‌రింపజేశారు. ఈ సంద‌ర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. కరోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రస్తుత క‌ష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Tags: Minister Errabelli, trader, donates, 1 lakh, mahabubabad, warangal

Advertisement

Next Story