- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గింజ కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదే
దిశ, వరంగల్: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సీఎం హామీ మేరకు సంబంధిత శాఖల అధికారులంతా కలసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. శనివారం స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి దయాకర్‌రావు ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. స్వీయ నియంత్రణతో కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ధరలను నియంత్రించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పౌరసరఫరాల, వ్యవసాయ, రవాణా, పోలీసు తదితర శాఖల అధికారులతో ప్రభుత్వం కమిటీలు వేసిందన్నారు. వారంతా కలసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు, పోలీసులు, పంచాయతీ రాజ్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని మంత్రి కొనియాడారు.