- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
రైతులు ఇబ్బంది పడొద్దు: ఎర్రబెల్లి

దిశ, వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతాంగానికి అవసరమైన సాగు నీటిని అందిస్తున్నారనీ, 24 గంటల పాటు కోతల్లేని, నాణ్యమైన కరెంటుని అందిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతుల ధాన్యం కొనుగోలు కోసం రూ.30 వేల కోట్లు, మక్కల కొనుగోలు కోసం రూ.3వేల కోట్లను కేటాయించారని చెప్పారు. ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని శుద్ధి చేసి కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. అలాగే, కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
tags : Minister Errabelli Dayakar Rao, opened, grain buying center, warangal