- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల భద్రత విషయంలో రాజీపడం : అవంతి
దిశ, విశాఖపట్నం : మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖలో అభయం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల భద్రత,రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో అమరుస్తామన్నారు.
స్మార్ట్ ఫోన్ కలిగిన మహిళలు, ప్లేస్టోర్ ద్వారా అభయం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని , తన మొబైల్ నెంబరుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. జర్నీ సమయంలో నమోదు చేసిన రూట్‌లో కాకుండా, వేరే రూట్‌కు వెళ్లినా లేక డ్రైవరు ప్రవర్తన గుర్తించిన వెంటనే బటన్ నొక్కడం ద్వారా వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అలర్టు వెళుతుందని చెప్పారు.జీపీయస్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఆపదలో ఉన్నమహిళలను రక్షించడం జరుగుతుందన్నారు. అభయం యాప్ ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా , జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, డీటీసీ రాజారత్నం, డిగ్రీ కళాశాల విద్యార్ధినులు పాల్గొన్నారు.