ఏపీలో కరోనా ప్రచార రథాలు ప్రారంభం

by srinivas |
ఏపీలో కరోనా ప్రచార రథాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రచార రథాలను ప్రారంభించింది. శుక్రవారం విశాఖ జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రచార రథాలను ప్రారంభించి మాట్లాడారు. కరోనాపై అవగాహన కోసం ప్రచార రథాలను ప్రారంభించడం సంతోషకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంతోమంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, కరోనా నివారణపై అవగాహన కోసం ఈ రథాలు పనిచేయనున్నాయని మంత్రి పేర్కొన్నారు. సైబర్ స్రైమ్, ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు ఈ వాహనాల ద్వారా సమాచారం ఇస్తారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని, వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story