ఈసీ విచక్షణ కోల్పోయి విచక్షణాధికారం వినియోగించారు: అనిల్ కుమార్ యాదవ్

by srinivas |
ఈసీ విచక్షణ కోల్పోయి విచక్షణాధికారం వినియోగించారు: అనిల్ కుమార్ యాదవ్
X

ఎలక్షన్ కమిషనర్ విచక్షణ కోల్పోయి తన విచక్షణాధికారం వినియోగించినట్టున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా వేస్తూ ఎక్షలన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తాడేపల్లిలో ఆయన స్పందిస్తూ, ఈసీ నిర్ణయాన్ని ఊహించలేదని అన్నారు. ఫ్రాన్స్‌లో 5,500 మందికి కరోనా సోకితే సుమారు 127 మంది మరణించారని, అక్కడే స్థానిక ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఫ్రాన్స్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉందా? అని ఆయన ఈసీని ప్రశ్నించారు. ఒక వ్యక్తికో లేక తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుకోసమో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపలేక ఈసీని అడ్డంపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయించారని ఆయన మండిపడ్డారు.

tags : anil kumar yadav, ysrcp, election commission, france, coronavirus

Advertisement

Next Story

Most Viewed