30లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వాలి : మంత్రి అల్లోల

by Aamani |   ( Updated:2021-05-16 08:23:20.0  )
30లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వాలి : మంత్రి అల్లోల
X

దిశ, మంచిర్యాల : జిల్లాలో ఈ నెల 30లోపు ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్‌లో గల సింగరేణి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 96 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ధాన్యాన్ని ఈనెల 30వ తేదీలోగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరగా రైసుమిల్లులకు రవాణా చేయాలని తెలిపారు. జిల్లాకు 33 లక్షల గన్నీ సంచులు పంపిణీ చేశామన్నారు.

ప్రస్తుతం14 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని తెలిపారు. 270 లారీలు అందుబాటులో ఉన్నాయని, కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రణాళికా బద్ధంగా ఆయా రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు, తరలింపు ఇతర సంబంధిత కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా మేనేజర్ గోపాల్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, జిల్లా రవాణా అధికారి కిష్టయ్య, డీసీఎం ఎస్ అధికారులు, ఐకేపీ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, గుత్తేదారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed