‘ప్రతిపక్షాల చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మ’

by srinivas |
‘ప్రతిపక్షాల చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మ’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పూర్తిగా ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సోమవారం నుంచి అమ్మఒడి పథకం రెండో విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌కు లోబడే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరి చేతికి డబ్బులు ఇవ్వడం లేదని, అందరికీ అకౌంట్లు నగదు జమ చేస్తున్నామని సూచించారు.

Advertisement
Next Story