ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష

by srinivas |
ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిద్ నిబంధనలు అనుసరించి ఏపీలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గురువారం మంత్రి ప్రవేశ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐ సెట్ , సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామన్నారు. మొత్తంగా అన్ని ప్రవేశ పరీక్షలకు 4 లక్షల 36 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు మంత్రి ప్రకటించారు.

Advertisement

Next Story