బస్‌పాస్ కౌంటర్లుగా మినీ బస్సులు

by Shyam |   ( Updated:2021-08-06 07:03:31.0  )
Bus Pass Counter
X

దిశ,తెలంగాణ బ్యూరో : గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాల్లోనే నడుస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టింది. మొదటగా ఆర్టీసీని కార్గో సేవలకు వినియోగించేలా నిర్ణయం తీసుకొని కొంత ఉపశమనం పొందింది. గతేడాది మార్చి నుంచి హైదరాబాద్ మహానగరంలో బస్సుల వినియోగం చాలా మేరకు తగ్గింది. ప్రయాణికులు లేక కొన్ని రూట్లలో బస్సులను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా నిలిపివేసిన బస్సులను బయో టాయిలెట్స్‌గా, షీ టాయిలెట్స్‌గా ప్రభుత్వం కొన్ని చోట్ల వినియోగించిన విషయం తెలిసిందే.

TS RTC

ప్రస్తుతం పక్కన పెట్టిన మినీ బస్సులను విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా బస్ పాస్ కౌంటర్లుగా ఏర్పాటు చేసింది. ఆర్టీసీ వీటిని నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసింది. అందులో ఒకటి నగరంలోని ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇలా ప్రయాణికులకు వీలుగా ఏర్పాటు చేస్తున్న మినీ బస్సు టికెట్ కౌంటర్లపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed