‘తెలంగాణ గడ్డపై రాజన్న బిడ్డ’.. షర్మిల సభలో సినిమాను మించిన సీన్‌లు

by Anukaran |   ( Updated:2023-03-20 20:45:49.0  )
‘తెలంగాణ గడ్డపై రాజన్న బిడ్డ’.. షర్మిల సభలో సినిమాను మించిన సీన్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ జే‌ఆర్‌సీ కన్వెన్షన్‌లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నారు. ఇందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. సినిమా రేంజ్‌ని తలపించేలా ఆవిర్భావానికి ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వైఎస్సార్ విగ్రహం, మరోవైపు తెలంగాణ అమరవీరుల స్తూపం, భారీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా వీక్షించేందుకు భారీ తెర ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లెసర్ లైట్‌ షో అందరినీ ఆకర్శించింది. పూర్తి స్థాయిలో సాంకేతికను వినియోగించారు. ఆవిర్భావ సభకు వచ్చిన అభిమానులు ఏర్పాట్లు అదుర్స్ అంటున్నారు. ఇదిలావుండగా కొద్దిసేపట్లో షర్మిల బేగంపేట నుంచి ర్యాలీగా పంజాగుట్ట సర్కిల్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ తన తండ్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా జేఆర్‌సీ కన్వెన్షన్‌కు రానున్నారు.

Advertisement

Next Story