- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కోటి లీటర్ల మార్కు దాటిన పాల రవాణా
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి పాల రవాణా మార్చి నెల నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 42ట్రిప్పుల ద్వారా కోటి లీటర్లకు పైగా పాలను ఢిల్లీకి రవాణా చేసినట్లు ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. అత్యవసర పరిస్థితులను అర్థం చేసుకుని రైల్వే సిబ్బంది అన్ని విధాలుగా సహకారం అందించారని తెలిపారు. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం 40 వేల లీటర్లు అని, ప్రతీ రైలుకు ఆరు ట్యాంకర్లను జోడించి దూధ్ దురంతో పేరుతో ఢిల్లీకి పాల రవాణా ప్రక్రియ మొదలైందని, ఇప్పుడు ప్రతీ రైలుకు ఎనిమిది టాంకర్లను జోడిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 26వ తేదీన మొదలైన పాల రవాణా ఇప్పటికీ కొనసాగుతూ ఉందని, ద.మ. రైల్వే పరిధిలోని రేణిగుంట నుంచి ఢిల్లీకి మధ్యలో ఎక్కడా ఆగకుండా గంటకు 110 కి.మీ. వేగంతో నాన్ స్టాప్ సర్వీసుగా నడుస్తోందని, 36 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుతోందని తెలిపారు. పాల లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు.