అప్పుడు పనికొచ్చిన నగ్నత్వం.. ఇప్పుడు పనికిరాదా? : మిలింద్

by Shyam |
అప్పుడు పనికొచ్చిన నగ్నత్వం.. ఇప్పుడు పనికిరాదా? : మిలింద్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ బర్త్‌డే పోస్ట్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. గోవాలో నగ్నం(#naked)గా పరుగెత్తిన ఫొటోపై విమర్శలు ఎదుర్కొన్న మిలింద్.. తాజాగా దీనిపై స్పందించారు. అలాంటి ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు అప్‌లోడ్ చేశావ్? రిమూవ్ చేయొచ్చు కదా! అని చాలా మంది అడిగారన్న మిలింద్.. నగ్నం(#naked) అని ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తే లక్షల్లో ఫొటోలు వస్తాయని, ఇక నేను పెడితే తప్పేంటని అన్నారు. అయినా ఇంతకు ముందు మేగజైన్స్‌కు, న్యూస్ పేపర్స్‌‌కు న్యూడ్‌గా పోజ్‌లు ఇచ్చినప్పుడు గానీ.. సినిమాల్లో సెక్స్ సీన్స్ చేసినప్పుడు గానీ లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని అని ప్రశ్నించారు. అక్కడ చేస్తే కరెక్ట్.. పర్సనల్‌గా సోషల్ మీడియాలో ఫొటో అప్‌లోడ్ చేస్తే మాత్రం తప్పా అన్నారు మిలింద్.

Advertisement

Next Story