హస్సీ, బాలాజీ ఎయిర్ అంబులెన్సులో తరలింపు

by Shyam |
Mike Hussey
X

దిశ, స్పోర్ట్స్: కరోనా బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలను ఢిల్లీ నుంచిఎయిర్ అంబులెన్సులో చెన్నైకి తరలించారు. ఐపీఎల్ వాయిదా పడటంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లందరూ మాల్దీవులకు చేరుకున్నారు. కానీ మైక్ హస్సీ మాత్రం కోవిడ్‌తో బాధపడుతుండటంతో ఆయన మాత్రం వారితో కలసి వెళ్లలేదు. మైక్ హస్సీ కోలుకునే వరకు అతడి బాధ్యతలు అన్నీ చెన్నై సూపర్ కింగ్స్ చూసుకోనున్నది. హస్సీ, బాలాజీ ఇద్దరూ కూడా కోవిల్ లక్షణాలు లేవని.. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సీఎస్కే యాజమాన్యం తెలిపింది. హస్సీని క్షేమంగా ఇంటికి పంపుతామని బీసీసీఐ హామీ ఇచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైతే చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది.

Advertisement

Next Story