'మ్యూచువల్ ఫండ్స్' లో పెట్టుబడులకు అవకాశాలెక్కువ

by Harish |
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు అవకాశాలెక్కువ
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్‌ల (Mutual Funds) ద్వారా చిన్న స్థాయి ఇన్వెస్టర్లు తమ పొదుపును స్టాక్ మార్కెట్ల (stock markets) కు మళ్లించడంతో ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన మార్పు జరిగాయని దేశీయ మ్యూచువల్ ఫండ్‌ల సంఘం యాంఫీ వెల్లడించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) నుంచి వస్తున్న ఈ మొత్తాలు స్టాక్ మార్కెట్లలో దేశీయ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడమే కాకుండా విదేశీ సంస్థాగత పెట్టుబడులకు సమానంగా పెరుగుతున్నాయని యాంఫీ ఛైర్మన్ నీలేశ్ షా ఓ ప్రకటనలో చెప్పారు.

యాంఫీ (AMFI) ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన నీలేశ్ షా.. ఇప్పటివరకు దేశంలో 2 కోట్ల మంది మ్యూచువల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని, ఈ రంగంలో విస్తరించేందుకు అనేక అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గత పాతికేళ్లలో ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు, అవగాహన పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అనుసరించేందు లాంటి పలు కీలక చర్యలను తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 2.25 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. పరోక్షంగానూ లక్షల మందికి ఉపాధినిస్తున్నట్టు తెలిపారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో 52 శాతం మంది వ్యక్తిగత ఇన్వెస్టర్లే అని నీలేశ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed