- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనుషులే లేని ప్రాంతంలో బ్యాంకు
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, గ్రంథాలయాలను ఊరి మధ్యలోనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే.. అవి ప్రజలకు అందుబాటులో ఉంటేనే వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు. అలాంటిది మెక్సికోలో మాత్రం.. ఎక్కడో సిటీకి దూరంగా, నిర్మానుష్య ప్రాంతంలో ‘బాంకో డెల్ బెయిన్‌స్టార్’ అనే బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇంతకీ అక్కడే ఎందుకు ఏర్పాటు చేశారు?
ఇండియాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఎక్కువగా స్టేట్ బ్యాంక్ సంబంధిత బ్యాంకుల్లోనే జరుగుతాయి. మెక్సికోలో కూడా అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యువల్ లోపెజ్ సూచన మేరకు.. ఈ తరహా సేవలందించేందుకు బాంకో డెల్ బెయిన్‌స్టార్ బ్యాంకును గతేడాది ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యాంకుకు కొత్తగా మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ బ్యాంకును మొదట ‘నియోవో కేసస్ గ్రాండిస్’ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడి మేయర్ స్థలం ఇవ్వకపోవడంతో.. మెక్సికన్ ఆర్మీకి చెందిన స్థలంలో బ్యాంకును ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రాంతం నగరానికి దూరంగా, నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండి ఎడారిని తలపిస్తోంది.
చిహువాహువా నగర ప్రజల కోసమే దీన్ని నిర్మిస్తుండగా.. రవాణా వ్యవస్థ లేకపోవడంతో నెటిజన్లు మెక్సికో అధ్యక్షుడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మనుషులు లేని చోట బ్యాంకును ఏర్పాటు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, ఈ బ్యాంకు వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని కామెంట్లు పెడుతున్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం.. సొంత కార్లు ఉన్న వాళ్లు బ్యాంకును చేరుకోవడం చాలా తేలికని, సొంత వాహనాలు లేని ప్రజల కోసం బ్యాంకుకు 100 మీటర్ల సమీపం వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని, అక్టోబర్‌లో బ్యాంకును ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు.