వాతావరణశాఖ హెచ్చరిక.. ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

by Anukaran |
rain
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో రాగల 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేశారు. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందన్నారు. వాయువ్య దిశగా పయనించి 48గంటల్లో ఉత్తర ఒడిశా – పశ్చిమబెంగాల్ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.

దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed