- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎల్జీ పాలిమర్స్‌ను తరలించే ఆలోచనలో ఉన్నాం:సుచరిత
by srinivas |

X
విశాఖపట్టణంలోని వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుచరిత అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. దుర్ఘటనకు కారణమైన పరిశ్రమను అక్కడి నుంచి తరలించే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. వలస కార్మికులందర్నీ ఒకేసారి వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడం వల్లే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి, మద్యం ధరలు పెంచామని ఆమె తెలిపారు.
Next Story